Saturday, April 26, 2025

తప్పించుకున్న కీలక నేతలు

- Advertisement -
- Advertisement -

కర్రెగుట్టల్లో భద్రతా దళాల కళ్లుగప్పిన మావోయిస్టులు పోలీసుల వలయం నుంచి
11మంది కేంద్ర కమిటీ సభ్యులు తప్పించుకున్నట్లు ఇన్ఫార్మర్ల సమాచారం భద్రాచలం
వైపు వెళ్లినట్లుగా నిర్ధారణ ఆ దిశగా సాగుతున్న గాలింపు ఆపరేషన్ కగార్
ఆపివేయాలని మావోల లేఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాంతి ప్రతిపాదనలు

మన తెలంగాణ/వాజేడు: కర్రె గుట్టలను చుట్టుముట్టిన పో లీస్ దళాల కళ్ళుకప్పి 11 మంది మావోయిస్టు కేంద్ర కమి టీ సభ్యులు తప్పించుకున్నారు. వారిని పట్టుకునేందుకు భ ద్రాచలం వైపు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశా రు. కర్రె గుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో 20 వేల ప్రత్యేక ఆర్మీ పోలీస్ బలగాలు కర్రె గుట్టను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. కర్రెగుట్టలో ఉన్న మావోయిస్టు నక్సలైట్లు అక్కడ నుండి తప్పించుకునేందుకు మూడు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.అందులో భాగంగా 11 మం ది కేంద్ర కమిటీ సభ్యులు కర్రె గుట్టల నుండి తప్పించుకున్నా రు. వారి ఆచూకీని కనుగొనేందుకు పోలీసు బలగాలు అప్రమత్తమయ్యా యి. కర్రె గుట్టల్లో దాగి ఉన్న నక్సలైట్లు రహస్య మార్గాల ద్వారా తప్పించుకుంటున్నారన్న ఇన్ఫార్మర్ల సమాచారం మేరకు ప్రత్యేక పోలీస్ బలగాలను

తప్పించుకున్న వారి కోసం గాలింపు చర్యలకు పంపారు. వారి వెళ్ళిన మార్గం కర్రె గుట్టల నుండి చర్ల భద్రాచలం వైపు వారు చేరుకునే అవకాశం ఉందని, ఆ దిశలో ప్రధాన రహదారులన్నీ తనిఖీ చే స్తూ వారిని వెంబడించాలని ఆక్టోపస్ ఐజి స్థాయి అధికారు లు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు నక్సల్స్ స్పె షల్స్ స్క్వాడ్ బయలుదేరి వెళ్ళింది.పీపుల్స్‌వార్ నుండి మా వోయిస్టు పార్టీగా అవతరించిన నక్సలిజం ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకొని తెలంగాణ, ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలను సరిహద్దుగా చేసుకొని దట్టమైన అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అబూ జమడ్, కర్రెగుట్టలు ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. ఈ గుట్ట లో గత 30 సంవత్సరాల నుండి మావోయిస్టులు స్థావరంగా చేసుకొని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News