Thursday, November 14, 2024

‘దసరా’ దొంగలపై పోలీసు నజర్!

- Advertisement -
- Advertisement -
Police form special focus on Dasara thieves
ఊళ్లకెళ్లేవారు ముందస్తు సమాచారమివ్వాలని సూచన

మన తెలంగాణ/హైదరాబాద్ : దసరా పండుగకు కుటుంబ సమేతంగా ఊరికి వెళతున్నారా..! ఇళ్లలో ఉన్న సొమ్మును దోచుకునేందుకు దొంగలున్నారు జాగ్రత్త అంటూ పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో దొం గలపట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసు బాసులు హెచ్చరికతో పాటు సలహాలిస్తున్నారు. పండుగకు ఊళ్లకు వెళ్లే వారు తమ సమీప పోలీస్‌స్టేషన్‌లో తప్పకుండా సమాచారం అందించాలని, ఇంటి తాళాలను అప్పగించిన పక్షంలో సొమ్ము కాపా డే బాధ్యత పోలీసులు తీసుకుంటారని హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర, అంతరాష్ట్ర ముఠాలు, చెడ్డీగ్యాంగ్ తదితర దొంగల ముఠాలు సంచరిస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పట్టపగలు చోరీలతో పాటు ఘోరాలు చోటు చేసుకుంటున్న విష యం విదితమే.

కామారెడ్డి జిల్లాలో మహిళా దొంగల ముఠా హల్‌చల్ చేస్తూ పట్టపగలే ఇళ్లల్లోకి దూరి చోరీలు చేస్తున్నారు. ఇటీవల జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో అందోలులో ఇంటి కి తాళాలు వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే స్థానికులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం ఒకేరోజు ఏడు చోట్ల దొంగతనాలు జరిగిన సంఘటన మరువకముందే తాజాగా శనివారం మరోసారి దొంగలు రెచ్చిపోయారు. రొయ్యలగూడెం కాలనీలో వరుసగా తాళాలు వేసిన ఏడు ఇళ్లు, రెండు కిరాణ దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడినట్టు స్థానికులు తెలిపారు. ఇళ్లకు వేసిన తాళాలు పగులగొట్టి నగదు, బియ్యం బస్తాలను అపహరించారు.కామారెడ్డి జిల్లాకేంద్రంలోకి అశోక్‌నగర్‌లో నివాసముంటున్న ఆర్టిసి కండక్టర్ జానకిరాములు ఇంట్లోకి ప్రవేశించి హల్‌చల్ చేశారు. ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉండటంతో వెనుకవైపు నుంచి ఇంట్లోకి చొరబడ్డారు.

ఇంట్లో బంగారు, నగదు వెతికినప్పటి అవి లభించించలేదు. విలువైన వెండి వస్తువులను అక్కడే పారేసి పోయారు. ముగ్గురు మహిళల దొంగల ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు వివరిస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లోని పాతబస్తీలోని ఆభరణాల తయారీ (కార్ఖానా) నుంచి 5 కేజీల బంగారం అపహరించిన విషయం తెలిసిందే. 12 సభ్యులు గల దొంగల ముఠా పట్టపగలే కార్ఖానాలోకి చొరబడి ఎంచక్కా చోరీ చేశారు. ఈనేపథ్యంలో పగటిపూట దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై కఠిన శిక్షలు పడేలా చేయాలని పలువురు బాధితులు మూకుమ్మడిగా కోరుతున్నారు. స్థానిక ప్రజలు పోలీసుల సహకారంతో చోరీలను నియత్రించుకోవాలని పోలీసు బాసులు తేల్చిచెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News