Sunday, January 19, 2025

పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత

- Advertisement -
- Advertisement -

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తరోడ్‌కు చెందిన కొలుగూరి పూజ తన ఫోన్ ఎక్కడో పడిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి ఫోన్‌ను గుర్తించి శుక్రవారం బాధితురాలికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలను సీఈఐఆర్‌లో నమోదు చేయాలన్నారు.

దీని ద్వారా ఫోన్‌ను పొందే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికైనా మొబైల్ ఫోన్‌లు, అనుమానిత వస్తువులు, ఇతర విలువైన వస్తువులు దొరికితే సమీప పోలీష్‌స్టేసన్‌లో అప్పగించాలన్నారు. అంతే కాని అలాంటి వస్తువులను తమ దగ్గర ఉంచడం వల్ల నేరం అని ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News