హైదరాబాద్ : బ్యాగును పోగొట్టుకున్న మహిళకు రెండు గంటల్లో దొరకబట్టి ఇచ్చిన సంఘటన భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. బ్యాగులోని రూ.1.5లక్షలు, మంగళసూత్రం ఉండడంతో మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. నగరానికి చెందిన మహిళ ఆటో ఎక్కి భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అందులో బ్యాగును మర్చిపోయి దిగిపోయింది. ఆటో వెళ్లిపోయిన తర్వాత గుర్తించి వెంటనే భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఎస్సై దామోదర్, పిసిలు శివకృష్ణ, అఖిల్ కుమార్, అఫ్రోజ్, రషీద్, మహేష్, రియాజ్ వెంటనే రంగంలోకి దిగారు. ఆటో డ్రైవర్ తన ఆటోలో ఉన్న బ్యాగును గుర్తించలేదు. రోజు మాదిరిగానే ఆటో తిప్పుతున్నాడు. వెంటనే ఆటోను పోలీసులు పట్టుకున్నారు. అందులోని బ్యాగును తీసుకుని వచ్చి బాధితురాలికి అప్పగించారు. తన బ్యాగును తిరిగి ఇప్పించిన పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు.