Tuesday, December 24, 2024

ఎపిలో పోలీసులకు రక్షణ లేదు: చంద్రబాబు నాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోందని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైసిపి ఎంఎల్‌ఎ అనుచరులు అనంతపురంలోని ఎస్‌ఇబి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన నేపథ్యంలో బాబు మీడియాతో మాట్లాడారు. అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని విడిచిపెట్టాలంటూ దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. పోలీసులను చితకబాదాడాన్ని పోలీస్ పెద్దలు, పాలకులు ఎలా సమర్థించుకుంటారని చంద్రబాబు అడిగారు. మహిళా పోలీసుల దుస్తులు లాగుతూ ఈడ్చుకెల్లడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. దాడిలో వైసిపి కార్యకర్తలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం దారుణమైన విషయమన్నారు. ఒక నేరగాడికి అధికారం ఇచ్చినందుకు భయం భయంగా బతకాల్సి వస్తుందన్నారు.

Also Read: పరీక్షలో కొడుకు ఫెయిల్.. తల్లి ఆత్మహత్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News