Monday, December 23, 2024

ఎపిలో మరకత పచ్చ పంచముఖ గణేశుడి పురాతన విగ్రహం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Police have seized an ancient emerald idol of five-faced Ganesha

విగ్రహాన్ని రూ. 25 కోట్లకు విక్రయించేందుకు బేరసారాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మరకత పచ్చ పంచముఖ గణేశుడి పురాతన విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పుతో 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని కొందరు రూ.25 కోట్లకు విక్రయించేందుకు బేరసారాలు సాగిస్తున్నట్టు ఒంగోలు క్రైం బ్రాంచి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులే కొనుగోలు దారులుగా నమ్మబలికి యర్రగొండ పాలెం -వినుకొండ రోడ్డులోని మారం వెంకటేశ్వరరెడ్డికి చెందిన షెడ్డులో ఈ విగ్రహాన్నిస్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ విగ్రహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇదిలావుండగా ఐదేళ్ల కిందట ఈ విగ్రహానికి సంబంధించి హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో విచారణ జరిగినట్లు ఒంగోలు క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News