Saturday, November 23, 2024

కీచకుడి కోసం హైవేలపై అణువణువు జల్లెడ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు నిందితుడి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఈ కేసును డీజీపీ నేరుగా పరిశీలిస్తున్నారు. డీజీపీ కార్యాలయం నుంచి అన్ని స్టేషన్లకు నిందితుడి సమాచారాన్ని చేరవేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరోవైపు నిందితుడి కోసం హైవేలను పోలీసులు జల్లెడ పడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైవేలపై పోలీసుల విసృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట, విజయవాడ హైవేపై పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఎల్బీ నగర్ నుంచి లింక్ ఉన్న హైవేలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితుడు రాజు నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించిన ఆనవాలు ఆధారంగా ఎల్బీ నగర్‌లో అణువణువు గాలిస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో రాజును ఒక కేసు విషయంలో చైతన్యపురి పోలీసులు పిలిచి విచారించారు. అక్కడ పోలీసులు తీసిన ఫోటోనే ఇప్పుడు కేసులో నిందితుడిని గుర్తించేందుకు కీలక ఆధారంగా మారింది. మొత్తం 1000 మంది పోలీసులు రంగంలోకి దిగారు.

టాస్క్ ఫోర్స్, సీసీఎస్, ఎస్‌వోటీ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాడి నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నారు. కల్లు, మద్యం దుకాణాలు, లేబర్ అడ్డాల్లో గాలిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో రాజు తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. రాజు గంజాయితో పాటు మద్యానికి బానిస అని పోలీసుల దర్యాప్తులో తేలింది. రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకండ్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు ఇప్పటికే గాలించారు.రాజు సమీప బంధువులను ప్రశ్నిస్తున్నారు. రాజు గురించి సమాచారమిస్తే రూ.10లక్షల రివార్డు అందజేస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. మేనత్త కుమార్తె మౌనికను రాజు ప్రేమించి పెళ్లి చేసుకోగా… వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. నిందితుడు రాజు గత కొన్ని నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడు.

Police held Search operation for Victim Raju

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News