Sunday, December 22, 2024

పూజాఖేద్కర్ తల్లిదండ్రుల కోసం పోలీస్‌ల గాలింపు

- Advertisement -
- Advertisement -

వివాదాస్పద ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లిదండ్రుల కోసం పుణె పోలీస్‌లు గాలిస్తున్నారు. ఓ భూ వివాదం వ్యవహారంలో ఆమె తల్లి మనోరమ కొందరిని పిస్టోల్‌తో బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో పూజా తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీస్‌లు వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఇందులో భాగంగా సోమవారం ఉదయం బానేర్ ప్రాంతంలో మనోరమ, దిలీప్ ఖేద్కర్ నివాసానికి వెళ్లారు. లోపలి తలుపులు లాక్ చేసినట్టు గుర్తించామని పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో పుణె, ఇతర ప్రాంతాల్లో వారి కోసం గాలిస్తున్నట్టు పోలీస్‌లు తెలిపారు.

పుణెలోని ముల్షి తహసీల్ పరిధిలోని దద్వాలి గ్రామంలో భూ వివాదం విషయంలో మనోరమ తన సెక్యూరిటీ గార్డులతో కలిసి పిస్తోలుతో బెదిరింపులకు దిగినట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యవహారంలో ఖేద్కర్ దంపతులతోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదైంది. విచారణకు పిలిచినా ఆ దంపతులు రాలేదని, మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేశారని పోలీస్‌లు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News