- Advertisement -
ఛత్తీసగఢ్: ఆపరేషన్ కర్రెగుట్టలు కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నారు. కర్రెగెట్టలను చుట్టుముట్టి తుపాకులతో విరుచుకుపడుతున్నారు. ఐదు రోజులుగా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్‌లో బలగాలు.. మావోయిస్టుల బంకర్ గుర్తించినట్లు తెలుస్తోంది. దాదాపు వెయ్యి మంది ఉండేలా భారీ గుహా గుర్తించినట్లు కథనాలు వస్తున్నాయి. భద్రతా బలగాల దాడి చేస్తుండటంతో అక్కడి నుంచి వేరే చోటుకు మావోయిస్టులు మకాం మార్చిన సమాచారం. కర్రెగుట్లల్లో అనేక గుహలు ఉండటంతో బలగాల సెర్చ్ ఆపరేషన్ కఠినంగా కొనసాగుతోంది. కాగా, భద్రతా బలగాలు ఇప్పటికే దాదాపు 30 మంది నక్సల్స్ ను చంపినట్లు తెలుస్తోంది.
- Advertisement -