Wednesday, January 22, 2025

నగరంలో మరింత నిఘా పెంచిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తన నియామవళిలో భాగంగానగరంలో పోలీసు నీఘా నీడలో కొనసాగుతోంది. ఈ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను అక్రమ డబ్బు, మద్యం ఇతర ప్రలోభవ వస్తువులకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. అయినప్పటీకి కొంతమంది అభ్యర్థులు పోలీసుల తనిఖీలను తప్పించేకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తునే ఉన్నారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సైతం పరిసమాప్తంకావడంతోశుక్రవారం నుంచి మరింత నిఘా పెట్టారు. గత నెల 9న షెడ్యూల్ విడుదలైన మొదలు కోడ్‌లో భాగంగా శుక్రవారం నాటికి జిల్లా వ్యాప్తంగా రూ. 48,94,33,215 నగదును సీజ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల ప్రవర్తణ నియామవళిలో భాగంగా 663 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ కింద 4,563 లైసెన్స్ ఆయుధాలను సేకరిండంతో పాటు . సి.ఆర్.పి సి 50 నమోదు కాగా ఇప్పటి వరకు 1022 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా నేడు 2712 బైండోవర్ చేయగా, 2645 నక్కాస్‌ఆపరేషన్స్,తో పాటు 2195 నాన్ బెయిలబుల్ వారంట్ లను జారీ చేశారు.

ఎం.సి.సి కింద పబ్లిక్ ప్రాపర్టీస్ లో శుక్రవారం నాటికి 5,715 వాల్ రైటింగ్,86,240 పోస్టర్ 29,904 బ్యానర్ తొలగించడంతో పాటు 92,886 విగ్రహాలకు ముసుగులు వేశారు. అదేవిధంగా ప్రైవేట్ ప్రాపర్టీలలో 21,542 పోస్టర్లను 5,290 బ్యానర్లులను తొలగించడంతో పాటు 22,890 విగ్రహాలకు ముసుగు వేశారు. ఇప్పటి వరకు మొత్తం 47 అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా వాహనాల దురి్వియోగo కింద మలకపెట్ 1, ముషీరాబాద్ 2 కేసు నమోదు చేయగా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కింద మలక్ పేట్ 1, గోషామహల్-1, ఖైరతాబాద్ -2, చార్మినార్ 1 సంబంధిత పార్టీ ప్రతినిధుల పై 9 కేసులు నమోదుకు చర్యలు తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News