Thursday, January 23, 2025

ఎంఎల్ఎ నంది కారు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నిందిత కారు ప్రమాదంలో మృతిచెందడంపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పటాన్‌చెరు శివారులో ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు కారు ప్రమాదంలో కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. రోడ్డు ప్రమాదం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ముందు వెళ్తోన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఓఆర్‌ఆర్‌పై రెండో లైనులో వెళ్తోన్న వాహనం చివరకు రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోయినట్లు గుర్తించారు. ప్రమాద స్థలం నుంచి దాదాపు 500మీటర్ల దూరంలో కారు స్పేర్‌పార్టు, కారుపై రాక్‌శాండ్ పౌడర్ పడి ఉండటంతో టిప్పర్ లేదా రెడిమిక్స్ వాహనాన్ని ఢీకొట్టి ఉంటుందని నిర్ధరణకు వచ్చారు.

ప్రమాద సమయంలో ఓఆర్‌ఆర్‌పై వెళ్లిన ఆరు టిప్పర్‌ల వివరాలను గుర్తించారు. అయితే, ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఆకాశ్ మద్యం తాగి ఉన్నాడా? లేదా? అనే వివరాల నిర్ధరణ కోసం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపారు. ముత్తంగి బాహ్యవలయ రహదారి దాటుతున్న సమయాలను తెలుసుకొన్నారు. ఆకాశ్ చరవాణి వివరాలు కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ ఎదుట డ్రైవర్ వాంగ్మూలం తీసుకున్నారు. కారుకు యాక్సిటెండ్ కావడంతో తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, తనకు ఏమి గుర్తు లేదని డ్రైవర్ ఆశాశ్ చెప్పినట్లు తెలిసింది. హై ప్రొఫైల్ కేసుకావడంతో సంబంధిత శాఖలోని నిపుణులతో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News