Friday, January 24, 2025

స్టాన్లీ డ్రగ్ కేసులో కీలక సమాచారం వెలుగులోకి….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టాన్లీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల దర్యాపులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మత్తు లింకులపై టిఎస్ న్యాబ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. గోవాలోని జైలులో ఓక్రా సాయంతో స్టాన్లీ డ్రగ్స్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. డ్రగ్స్ కేసులో మూడు ఏళ్ల నుంచి ఓక్రా జైలు జీవితం గడపడంతో పాటు స్మార్ట్ ఫోన్ డ్రగ్ దందాను కొనసాగిస్తున్నాడు. స్టాన్లీ ఆర్డర్‌తో ఓక్రా నెదర్లాండ్స్ నుంచి కార్గో, షిప్పుల్లో డ్రగ్స్ తెప్పిస్తున్నాడు. వస్త్రాల పెట్టెల్లో పుణెకు డ్రగ్స్ పార్సిల్ సరఫరా అవుతున్నాయి. పుణెలో సరకు తీసుకొని స్టాన్లీకి సౌరవ్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నాడు. సౌరవ్ కోసం పుణెలో టిఎస్ వ్యాబ్ పోలీసులు గాలిస్తున్నారు. జైలులో ఫోన్లు వాడుతున్నారని గతంలోనే అధికారులకు టిఎస్ న్యాబ్ చెప్పారు. గోవా జైలు అధికారుల సోదాల్లో స్మార్ట్‌ఫోన్ బయటపడింది. డ్రగ్స్ విక్రయం ద్వారా ఏడాదికి రూ.2 కోట్లు స్టాన్లీ సంపాదిస్తున్నారు. పంజాగుట్ట పరిధిలో రెండు రోజుల క్రితం నైజీరియన్ స్టాన్లీని పోలీసులు అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News