Sunday, January 19, 2025

సినీ నటుడు రాజ్ తరుణ్ కు పోలీసుల నోటీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లావణ్య అనే యువతిన ఎన్నో ఏళ్లు వాడుకుని వదిలేసిన సినీ నటుడు రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18లోపు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. బిఎన్ఎస్ఎస్ 45 కింద ఈ నోటీసులు ఇచ్చారు.

రాజ్ తరుణ్ నటి మాల్వీ మల్హోత్రా పరిచయమయ్యాక ఎన్నో ఏళ్లుగా సహ జీవనం చేసిన లావణ్యను దూరం పెట్టాడు. మాల్వీ మల్హోత్రా తో పాటు ఆమె సోదరుడు మయాంక్ తనను బెదిరించారని లావణ్య కేసు పెట్టింది. తీవ్ర నిరాశకు లోనైన ఆమె చివరికి ఇటీవల ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది. కానీ పోలీసులు ఆమెను సకాలంలో కాపాడి కౌన్సలింగ్ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News