Monday, December 23, 2024

వారంలో పోలీస్ కొలువుల నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Police jobs notification release during the week

రాష్ట్రంలో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తున్నాం

కేంద్రంలోని 15లక్షలకు పైగా పోస్టులను
ఎప్పుడు నింపుతారో బిజెపి నాయకులు
చెప్పాలి వారెందుకు యాత్ర చేస్తున్నట్టు,
ధరలు పెంచినందుకా.. ఉద్యోగాలు
ఇవ్వనందుకా.. ప్రజల జీవితాలను ఆగం
చేస్తున్నందుకా? విద్యార్థుల కోరిక మేరకు
వయో పరిమితిని సిఎం కెసిఆర్ మూడేళ్లు
సడలించారు 95% ఉద్యోగాలు
స్థానికులకే దక్కేలా చేశారు పోలీసు
ఉద్యోగాల్లో మహిళలకు 30%
20వేల పోలీసు కొలువులకు ఈ వారంలో
నోటిఫికేషన్ విడుదల చేస్తాం: పటాన్‌చెరులో
ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ
ప్రారంభిస్తూ మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీ సు ఉద్యోగాల నోటిఫికేషను వారంలో విడుదల చేస్తామని యువత సిద్ధంగా ఉండాల ని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పటాన్‌చెరులో ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఎమ్మెల్యే గూడెం మ హిపాల్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నాం.. కేంద్రంలో 15 లక్షల పైగా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో బిజెపి నాయకులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి స మాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు ప్ర జల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చే స్తున్నారా? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా… ప్రధాని మోడీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించాలని నిరుద్యోగులకు ఆర్థిక, అరోగ్య మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. విద్యార్థుల కోరిక మేరకు సిఎం కెసిఆర్ వయో పరిమితిని మూడేళ్లు సడలించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం కల్పించామని తెలిపారు. తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూసేందుకు ఉద్యోగం సాధించాలని.. కష్టపడి కలను నేరవేర్చుకోవాలని నిరుద్యోగులకు మంత్రి సూచించారు. 20వేల పోలీస్ ఉద్యోగాలకు ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలిపారు.

దళిత బంధు యూనిట్ల పంపిణీ

దళిత బంధు కార్యక్రమం ఒక మారుమూల గ్రామానికి సైతం చేరింది. కలలో కూడా అనుకోనిది ముఖ్యమంత్రి సాకారం చేశారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జహీరాబాద్‌లో జరిగిన దళిత బంధు యూనిట్ల పంపిణీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అప్పులు కావలంటే చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. ఇప్పుడు అప్పులు, కిస్తీలు, వడ్డీలు, అసలు కట్టేది లేకుండా 10 లక్షలు అందజేస్తున్నామని వెల్లడించారు ఈ ఏడాదిలో నియోజక వర్గానికి 1500 మందికి దళిత బంధు అందజేస్తామన్నారు. దేశంలో ఉన్న 40 కోట్ల ఎస్సీ ఎస్టీ లకు కేంద్రం బడ్జెట్ లో కేవలం 12,821 కోట్లు పెట్టింది. అంటే మొత్తం బడ్జెట్ లో ఇది 0.33 శాతం. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీలకు 47,350 కోట్లు కేటాయించిందని… ఇది 18.43 శాతం అన్నారు. పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు 20 లక్షల రూపాయలను అంబేద్కర్ ఓవర్సీస్ గ్రాంట్ కింద ప్రభుత్వం ఇస్తున్నది.

దళిత బంధు పథకం లో భాగంగా అన్ని ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చాం. డైట్ కాంట్రాక్టు, శానిటేషన్ కాంట్రాక్టు, వైన్ షాప్ కేటాయింపుల్లో రిజర్వేషన్ తెచ్చాం. ఇంకా తెబోతున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం మొదట ఎస్సీల తో ప్రారంభమైంది. ఆ తర్వాత అందరికీ వర్తింపజేసి లక్ష 116 అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపి పాటిల్, ఎమ్మెల్యే మాణిక్య రావు, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి హరీశ్‌రావుతో పాటు ఎంపి బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, ఎమ్మెల్యే మాణిక్య రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News