Saturday, October 19, 2024

గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీ చార్జ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/విద్యానగర్: గ్రూప్-1 అభ్యర్థులు మళ్ళీ ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా రో డ్డుపైకి వచ్చిన నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల లాఠీఛార్జ్ కారణంగా పలువురు అభ్యర్థులకు గాయాలయ్యాయి. పెద్ద సంఖ్యలో అభ్యర్థులతో పాటు వారి కి మద్దతుగా వచ్చిన బిజెపి నాయకులను పోలీసు లు అరెస్టు చేసి వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రీ షె డ్యూల్ చేయడంతో పాటు ప్రిలిమ్స్ ఫలితాలలో జ రిగిన పొరపాట్లను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ ని రసనలు చేస్తున్న నిరుద్యోగులు శుక్రవారం మ ధ్యాహ్నం మళ్ళీ అశోక్ నగర్ చౌరస్తాలో మెరుపు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రూప్ 1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.

రోడ్లపై బైటాయించిన అభ్యర్థులను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులు విఫలం కావడంతో లాఠీలకు పనిచెప్పారు. నిరసనలకు దిగిన వారిని లాఠీలతో కొడుతూ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. లాఠీఛార్జ్ కారణంగా పరుగులు పెడుతున్న అభ్యర్థుల ను పోలీసులు వెంటాడి లా ఠీలతో కొట్టారు. కొందరికి దెబ్బలు గట్టిగా తగలడంతో రక్తస్రావం జరిగింది. ఇది గమనించిన అభ్యర్థులు మ రింతగా స్వరం పెంచి జి. ఓ నంబర్ 29 ని రద్దు చేయాల ని డిమాండ్ చేశారు. ఈ సం దర్భంగా పలువురు అభ్యర్థు లు మాట్లాడుతూ న్యాయం చేయమం రక్తం కళ్ళ చూస్తారా అని ప్రశ్నించారు. జి. ఓ. 29నీ రద్దు చేసి, జి. ఓ.55ను అమలు చేసేంతవరకు ఆందోళనలు ఆపేది లేదన్నారు. లాఠీచార్జి చేస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. 22 కేసులు ఉన్నప్పటికీ పాలకులు మొండిగా వ్యవహరిస్తూ రాజ్యంగ విరుద్ధంగా మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారని మండి పడ్డారు.

మూడు పోలీస్ స్టేషన్ల నుంచి భారీగా మోహరించిన పోలీసులు బలవంతంగా అభ్యర్థులను పట్టుకుని వాహనల్లోకి ఎక్కిస్తున్న సమయంలోనే వారికి మద్దతుగా బిజేపి నాయకులు, కార్యకర్తలు సైతం ఆందోళనకు దిగి అశోక్ నగర్ చౌరస్తాలోనీ రోడ్లపై బైటాయించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి. పోలీసులు ఒకపక్క ఆందోళనకారులను అరెస్టు చేస్తూనే మరోపక్క మరోపక్క వాహనాలు సాఫీగా వెళ్లేందుకు చెమటోడ్చారు.

లాఠీచార్జీకి సిపిఎం ఖండన
గ్రూప్1 అభ్యర్థులు జి.ఓ.నెంబర్ 55 ప్రకారం మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆందోళన చేస్తున్న గ్రూ ప్1 అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రస్తుతం అవలంబిస్తున్న జిఓ నెంబర్ 29 ప్రకారం జనరల్ కోటాలో ఎంపికైన రిజర్వ్ అభ్యర్థిని జనరల్ కోటాలో పరిగణించకుండా రిజర్వ్ కోటాలో పరిగణించడం వల్ల ఇతర రిజర్వుడ్ అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News