Saturday, November 23, 2024

అశ్లీల వెబ్‌సైట్లపై పోలీసు నజర్

- Advertisement -
- Advertisement -

Police look at pornographic websites

వీక్షించేవారిని ఐపి ఆధారంగా గుర్తింపు
ఐటి చట్టం కింద కేసులు నమోదు

మనతెలంగాణ, హైదరాబాద్ : ఇంటర్‌నెట్‌లో పోర్న్ వీడియోల సైట్లను వీక్షించేవారిపై పోలీసు నిఘా అధికం చేయనున్నారు. మోబైల్, కంప్యూటర్, ఇంటర్‌నెట్ సెంటర్లలో పోర్న్ వీడియోలు చూసేవారితో పాటు ఆయా వీడియోలను షేర్ చేసేవారిని ఐపి ఆధారంగా గుర్తించి వారిపై ఐటి చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసేందుకు సన్నద్థమౌతున్నారు. ఈక్రమంలో ఇంటర్‌నెట్‌లో పోర్న్ సైట్లను వీక్షించే వారిని ఆయా ఇంటర్‌నెట్ ఐపి ఆధారంగా గుర్తిస్తూ ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. పోర్న్ సైట్ల వీక్షించడం వల్ల మహిళలపై లైంగిక వేధింపులు అధికమౌతున్నాయని భావించిన పోలీసు బాసులు వాటిని వీక్షించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు పోర్న్ వీడియోలను తరచూ వీక్షించే వారిపై ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. పోర్న్ చిత్రాల వీక్షించిన వారిపై నేరం రుజువైన పక్షంలో వారిపై ఐటి యాక్ట్‌తో పాటు ఐపిసి సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు శిక్షలు తప్పవని పోలీసు బాసులు హెచ్చరిస్తున్నారు.

అదేవిధంగా పోర్న్ వీడియోలను వాట్సప్‌లలో షేర్ చేసేవారిపైనా చట్టరీత్యా చర్యలతో పాటు కేసులు నమోదు చేసేందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా పోర్స్ వెబ్‌సైట్ల కారణంగా అఘాయిత్యాలు పెరుగుతున్నాయని పోలీసులు భావిస్తూ ఈ తరహా చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గంటల తరబడి ఫోన్లలో పోర్న్ వెబ్‌సైట్లలో మునిగి తేలుతున్న వారిపై పోలీసులు దృష్టి సారించనున్నారు.దీంతో పోర్న్ చూసే వారి కదలికలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచనున్నారు. అశ్లీల వీడియోలు చూసేవారు, వాటిని డౌన్‌లోడ్ చేసుకునే వారు, షేర్ చేసే వారిపై నిఘాపెట్టారు. ఎవరు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు, షేర్ చేస్తున్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో అదేపనిగా అశ్లీల వీడియోలు చూస్తున్న వారిని గుర్తించి వారికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. హెచ్చరించినప్పటికీ మారకుండా పోర్న్ వీడియోలు చూస్తున్న వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమౌతున్నారు. కేసులు నమోదు చేసిన తర్వాత వారికి శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

నిందితులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అశ్లీల వీడియోలు షేర్ చేసేందుకు ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులపై పోలీసులు నిఘా సారిస్తున్నారు. అశ్లీల వీడియోలు చూస్తున్న గ్రూపులోని సభ్యులను పట్టుకుని కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. మొబైల్ ఫోన్ల ఐపి అడ్రస్ ఆధారంగా వారిని పట్టుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా మొబైల్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు రావడంతో ప్రతి ఒక్కరి చేతిలో అత్యాధునిక టెక్నాలజీ ఫోన్లు ఉంటున్నాయి. దానికి తోడు ఇంటర్ నెట్ వాడకం పెరగడంతో సులభంగా పోర్న్ వీడియోలు చేస్తూన్నారు. అంతేకాకుండా ఇంటర్‌నెట్ ప్యాకేజ్‌లు కూడా తక్కువ ధరకు లభిస్తుండడం ఒక కారణం కన్పిస్తోంది. మనదేశంలో పోర్న్ వెబ్ సైట్లపై ఆంక్షలు కూడా చాలా తక్కువగా ఉండడంతో సులభంగా వస్తున్నాయి. వాటిని నియంత్రించడంలో కూడా ప్రభుత్వాలు విఫలమయ్యాయి.

వీటిని పదేపదే చూడడం వల్ల నిందితులు ఎమి చేస్తున్నామో తెలియక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తర్వాత అది బయటపడుతుందని అభంశుభం తెలియని చిన్నారులను చిదిమేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ ఏడాది మూడు కమిషనరేట్ల పరిధిలో చాలా చోటుచేసుకున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ పోర్న్‌కు బానిసలుగా మారుతున్నారు. అదేపనిగా చూడడంతో వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోంది. ఒక్కసారి పోర్న్ వీడియోలకు బానిసలుగా మారిన తర్వాత వారిని మార్చడం చాలా కష్టంగా మారుతోందని, వారిని రిహాబిలిటేషన్ సెంటర్లలో చేర్పించినా వారిలో మార్పు తీసుకురావడం కష్టంగా మారుతోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News