న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా 30మంది సిబిఐ అధికారులకు పోలీస్ పతకాలు అందజేయనున్నారు. నేటి సాయంత్రం పోలీస్ పతకాలు అందుకోనున్నవారిలో.. పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను విచారించిన అధికారులతోపాటు గిరి మృతి, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్‌పై నమోదైన కేసులను విచారించిన సిబిఐ అధికారులు ఉన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ చెందిన ఆరుగురు అధికారులు ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి పోలీస్ పతకాలు అందుకోనుండగా మరో 24మంది పతకాలు అందుకోనున్నారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 1997 బ్యాచ్ ఐపిఎస్ అధికారి, జాయింట్ డైరెక్టర్ విప్లవ్‌కుమార్ చౌదరికి రాష్ట్రపతి పోలీస్ పతకాన్ని అందుకునేవారిలో ఉన్నారు.
జెడి విప్లవ్‌కుమార్ పర్యవేక్షించిన కేసుల్లో ఇటీవల చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి లభ్యమవుతున్న వీడియోలుపై నమోదైన కేసు, ప్రయాగరాజ్‌లో అఖిల భారతీయ అక్షర పరిషత్ అధ్యక్షుడు మృతికి సంబంధించిన కేసు ప్రధానంగా ఉన్నాయి. విప్లవ్ బ్యాచ్‌మెట్, అదనపు జెడి శరద్ అగర్వాల్ పర్యవేక్షించిన ఆర్జేడీ సుప్రీం లాలు ప్రసాద్ యాదవ్‌పై నమోదైన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. శరద్ అగర్వాల్ కూడా రాష్ట్రపతి పోలీస్ పతకాన్ని అందుకోనున్నారనిప్రకటనలో తెలిపారు.