క్రమశిక్షణతో పనిచేయాలి
పోలీసులు శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలి
సైబరాబాద్ సిపిని కలిసి రిజర్వు ఎస్సైలు
మనతెలంగాణ, సిటిబ్యూరో: పోలీసులు విధుల పట్ల క్రమశిక్షణతో పనిచేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించబడ్డ రిజర్వు సబ్ ఇన్స్‌స్పెక్టర్లు సోమవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్రను కలిశారు. 2020 బ్యాచ్‌కు చెందిన 23మంది రిజర్వు సబ్ ఇన్స్‌స్పెక్టర్లు గ్రే హౌండ్స్, ఐఎస్‌బబ్లూ, సిఎస్డబ్లూ, ట్రాఫిక్, పిటిఓ వంటి వివిధ విభాగాల్లో ఫీల్డ్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో రిపోర్టు చేశారు. 23మంది 20మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉండాలని కోరారు.
పోలీసులు విధి నిర్వహణలో నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలని అన్నారు. పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాని అన్నారు. పోలీస్ శాఖ క్రమశిక్షణ కలిగిన డిపార్ట్‌మెంట్ అని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో విధి నిర్వహణలో అలసత్వం వహించరాదని అన్నారు. ప్రజల మేలు కోసం నిబద్దతతో పనిచేసి తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఆధునిక పోలీసింగ్‌పై దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ఫైనాన్షియల్ ట్రాన్‌జాక్షన్స్, లోన్ యాక్ట్ తదితర విషయాలపై పరిజ్ఞానం పెంచుకోవాలని అన్నారు. ప్రొబేషనరీ ఎస్సైల విద్యార్హతను బట్టి వారి సేవలను ఉపయోగించుకుంటామని అన్నారు. సిబ్బంది మేనేజ్‌మెంట్, టైం మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో ఎడిసిపి రియాజ్, ఎసిపి మట్టయ్య, అడ్మిన్ ఆర్‌ఐ హిమకర్ తదితరులు పాల్గొన్నారు.