లక్నో: మాస్కు పెట్టుకోలేదని ఓ వ్యక్తిని పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీ ప్రాంతం బరాదరీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సోమవారం రాత్రి పది గంటల సమయంలో తన కుమారుడి ఇంటి ముందు భాగంలో తండ్రి కూర్చున్నాడు. ముగ్గురు పోలీసులు అక్కడికి వచ్చి మాస్కులు ఎందుకు పెట్టుకోలేదని కుమారుడిని ప్రశ్నించారు. తమ ఇంటి ముందు భాగంలోనే ఉన్నామని ఇతరులు ఎవ్వరు ఇక్కడలేరని అందుకే మాస్కులు పెట్టుకోలేదని కుమారుడు పోలీసులకు సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులకు, అతడికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు అతడిని పట్టుకొని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులనే ప్రశ్నిస్తావా? అని అతడి చేతులు, కాళ్లపై మేకులు కొట్టారు. మరునాడు చేతికి, కాళ్లకి మేకులతో కుటుంబ సభ్యులకు కనిపించడంతో పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సీనియర్ ఎస్‌పి రోహిత్ సజ్వాన్ మీడియాతో మాట్లాడారు. ఆ వ్యక్తిపై గతంలో క్రిమినల్ కేసులున్నాయని, కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నాడని తెలియజేశారు.
మాస్కుపెట్టుకోలేదని…. కాళ్లు, చేతులపై మేకులు కొట్టారు…
- Advertisement -
- Advertisement -
- Advertisement -