రివ్యూ నిర్వహించిన సైబర్ సైబర్ క్రైం డిసిపి లావణ్య
హైదరాబాద్: సైబర్ నేరాల కేసులను దర్యాప్తు చేసేందుకు పోలీసులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైం డిసిపి లావణ్య అన్నారు. సైబర్ క్రైంలపై డిసిపి గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిపి లావణ్య మాట్లాడుతూ సైబర్ నేరాలను అడ్డుకునేందుకు పటిష్టమైన వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న రోజుల్లో సైబర్ నేరాలు మరింత పెరుగుతాయని, వాటికి అనుగుణంగా నిపుణులైన పోలీసులు కావాల్సి ఉంటుందని అన్నారు. పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఇన్వెస్ట్‌గేషన్ ఆపరేషన్ సెంటర్ సైబర్ నేరాలపై విశ్లేశణ చేసి సంబంధిత ఇన్వెస్టిగేషన్ అధికారికి సహకరిస్తుందని తెలిపారు. స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులకు సైబర్ నేరాల దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్ సపోర్టు సెంటర్ సహకరిస్తుందని అన్నారు. దర్యాప్తు చేసిన కేసుల గురించి స్టడీ చేసేందుకు పోలీసులకు అందిస్తామని తెలిపారు. ప్రతి ఇన్వెస్టిగేషన్ అధికారి సమర్థవంతంగా పనిచేసి సైబర్ నేరస్థులకు హడల్ పుట్టించాలని అన్నారు. సమావేశంలో ఎసిపి వెంకట్ రెడ్డి, న్యాయసలహాదారు అశ్విన్ రెడ్డి, డిఐలు, ఇన్స్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.