Wednesday, January 22, 2025

బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసుల నోటీస్

- Advertisement -
- Advertisement -

బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసులు నోటీసు జారీ చేశారు. డిసెంబర్ 16న విజేతను ప్రకటించిన అనంతరం చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఈ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 16వ తేదీ రాత్రి, బిగ్ బాస్ ఫైనలిస్టుల అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి, అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల విధ్వంసానికి దిగిన సంగతి తెలిసిందే. వారి దాడిలో ఐదు ఆర్టీసి బస్సులు, ఓ పోలీస్ వాహనం, కొన్ని ప్రైవేట్ కార్లు ధ్వంసమయ్యాయి. రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ చౌదరి కారు ధ్వంసమైనా, అదృష్టవశాత్తూ అతను ఎలాంటి గాయాలు తగలకుండా తప్పించుకున్నాడు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సివచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు బిగ్ బాస్ ఫైనల్ విజేత పల్లవి ప్రశాంత్ ను, అతని సోదరుడు మహావీర్ తోపాటు మరికొందరని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రశాంత్, మహావీర్ లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News