- Advertisement -
అమరావతి: విశాఖ పట్నానికి చెందిన కెమికల్ ఇంజినీర్ మల్లిక్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో గాజువాకలో మల్లిక్ ఇంటికి వచ్చి సుల్తాన్ బజార్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కరోనా థర్డ్ వేవ్ అతి ప్రమాదకరమంటూ మల్లిక్ వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. మల్లిక్ వ్యాఖ్యలు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 5లోపు సుల్తాన్‌బజార్ పిఎస్‌లో హాజరుకావాలని మల్లిక్‌కు నోటీసులు జారీ చేశారు.
- Advertisement -