Thursday, December 26, 2024

దువ్వాడ శ్రీను, దివ్వల మాధురిలకు పోలీసు నోటీసులు

- Advertisement -
- Advertisement -

టెక్కాలి: దువ్వాడ శ్రీను, దివ్వల మాధురి ఫొటోషూట్‌పై విచారణను వేగవంతం చేశారు తిరుమల వన్‌టౌన్ పోలీసులు. ఇద్దరికీ 41ఏ నోటీసులు జారీ చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో… తిరుమలలో ఫొటోషూట్ చేయడంపై టిటిడి అభ్యంతరం వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలను దువ్వాడ, మాధురి దెబ్బతీశారని విజిలెన్స్ అధికారులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 10వ తేదీన కేసు ఫైల్ చేసిన పోలీసులు విచారణకు రావాలని దువ్వాడ శ్రీను, మాధురిలకు నోటీసులు ఇచ్చారు.

4వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో దువ్వాడ శీనుతో కలిసి మాధూరి రీల్స్‌ చేసినట్టు… ఫొటో షూట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.టిటిడి ఏవిఎస్ వో   మనోహర్ ఇచ్చిన ఫిర్యాదుతో 3 సెక్షన్ల కింద వారిపై కేసులు పెట్టారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాధురి, శ్రీను ప్రవర్తించారనేదానిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. తిరుపతి నుంచి ఒక పోలీస్‌ టీమ్‌ను శ్రీకాకుళం జిల్లా టెక్కలికి పంపారు. దివ్వల మాధురికి నేరుగా 41 నోటీసులు అందించబోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వ్యక్తిగత విషయాలు మాట్లాడినందుకు, రీల్స్‌ చేసినందుకు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినందుకు వివరణ ఇవ్వాలని కోరనున్నారు.

మాధురికి పూర్తి డిఫెన్స్‌గా నిలబడ్డారు దువ్వాడ శ్రీనివాస్. తమను ప్రశ్నించేవాళ్లను, తమపై కేసులు పెట్టిన వాళ్లను లాజిక్కులతో కొడుతున్నారు దువ్వాడ. ఇదిలా ఉంటే.. మాధురి ఉదంతాన్ని మరింత రక్తి కట్టిస్తూ హిందూ సంఘాలు సీన్లోకొచ్చేశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News