మన తెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరో సారి అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, పుష్ఫ2 ప్రీమియర్ షోలో తల్లిని పోగొట్టుకొని కిమ్స్ ఆస్పత్రిలో కోమాలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శిం చేందుకు అల్లు అర్జున్ సిద్దమయ్యారు. ఈ మేరకు పోలీసుల అనుమతి కోరారు. దీంతో, పోలీసుల నుంచి సమాధానం వచ్చింది. ఆస్పత్రికి వెళ్లేం దుకు పోలీసులు అల్లు అర్జున్‌కు అనుమతి నిరాకరించారు. ఒక వేళ వెళ్తే, అక్కడ చోటు చేసుకునే పరిణామాలకు బాధ్య త వహించాల్సి ఉంటుం దని స్పష్టం చేశారు. కిమ్స్ ఆస్పత్రికి వెళ్లవద్దని అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట పోలీసులు స్పష్టం చేసారు. అల్లు అర్జున్ పోలీసులు వచ్చిన సమయానికి నిద్ర లేవలేదని చెప్పడంతో మేనేజర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, పోలీసులు కోర్టు పర్మిట్ లేకుండా అల్లు అర్జున్ ఎక్కడికైనా వెళ్లకూడదని స్పష్టం చేశారు.
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి స్వయంగా సంతకం చేసిన అల్లు అర్జున్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు హీరో అల్లు అర్జున్ వెళ్లారు. సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీంతో జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు కారులో బయల్దేరి వెళ్లారు. స్టేషన్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన తర్వాత తిరిగి ఇంటికి బయల్దేరి వెళ్లారు. ఇక ఇదే కేసులో అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన రెగ్యూలర్ బెయిల్ మంజూరు అయింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ వాయిదా పడింది. కోర్టు ఆదేశాలతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన ప్రతక్ష్యంగా హాజరయ్యారు. అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.