Saturday, December 21, 2024

రామ్‌గోపాల్ వర్మకు మరోసారి పోలీసుల నోటీసులు

- Advertisement -
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ప్రకాశం పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న ఒంగోలు రూరల్ పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని సిఐ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు రామ్‌గోపాల్‌వర్మ వాట్సాప్ నెంబరుకు నోటీసు పంపించారు. అయితే, మంగళవారమే విచారణకు రావాలని రామ్‌గోపాల్ వర్మకు నోటీసులివ్వగా తనకు కొంత సమయం కావాలని కోరారు. షూటింగుల్లో బిజీగా ఉన్నందున సమయం కావాలని సీఐ వాట్సాప్‌నకు మెసేజ్ పంపించారు.

అనంతరం వర్మ తరఫు న్యాయవాదులు సైతం వచ్చి ఒంగోలు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామ్‌గోపాల్ వర్మ పంపిన లేఖను పోలీసులకు అందజేశారు. కాగా, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సిఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్‌పై రామ్‌గోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారని అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. దీనిపై రామ్‌గోపాల్‌వర్మ హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. ఈ విషయంపై పోలీసులతోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్
మరోవైపు, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని రామ్‌గోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News