- Advertisement -
జొప్లిన్ (యుఎస్): అమెరికా లోని మిసౌరీ నగరం నైరుతి ప్రాంతంలో మంగళవారం రాత్రి 1.30 గంటల సమయంలో ఒక షాపింగ్ సెంటర్ వద్ద జరిగిన కాల్పుల్లో పోలీస్ అధికారి, నిందితుడు మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరు అధికారుల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అసిస్టెంట్ పోలీస్ చీఫ్ బ్రియన్ లూయిస్ చెప్పారు. నార్త్‌పార్క్ క్రాసింగ్ షాపింగ్ సెంటర్ వద్ద రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఒక స్టోర్ వద్ద గొడవ జరుగుతుందన్న సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడకు వచ్చారు. నిందితుడు ఇద్దరు పోలీస్ అధికారులపై కాల్పులకు తెగబడగా వారిద్దరూ గాయపడ్డారు. నిందితుడు పోలీస్ కారును కాజేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తరువాత ఆ కారును ధ్వంసం చేసి కాలినడకన తప్పించుకున్నాడు. అధికారులు అతణ్ణి వెంబడించే సమయంలో వేరే పోలీస్ అధికారి , నిందితుడు కాల్పులకు గురయ్యారు.
- Advertisement -