Monday, December 23, 2024

మణిపూర్‌లో పోలీస్ అధికారి కాల్చివేత

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఓ పోలీస్ అధికారి కాల్పులకు బలయ్యారు. మోరే ప్రాంతంలో హెలిపాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోన్న సమయంలో చొరబాటు దారులు ఆయనను కాల్చిచంపారు. ఆ పోలీస్ అధికారి పేరు చింగ్తం ఆనంద్. ఆయన సబ్‌డివిజనల్ అధికారి హోదాలో ఉన్నారు. మయన్మార్ సరిహద్దులో ఈ సంఘటన చోటు చేసుకుందని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. కొద్ది గంటల క్రితం తిరుగుబాటుదారుల చేతిలో గాయపడిన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. హంతకుల కోసం ఆ ప్రాంతంలో పోలీస్‌లు ఆపరేషన్ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News