- Advertisement -
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు మరో షాక్ తగిలింది. ఆయనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. నేషనల్ అవార్డు అందుకునేందుకు తనకు బెయిల్ ఇవ్వాలని కోరిన జానీ మాస్టర్ కు ఇటీవల కోర్టు నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెల్ ప్రకటించింది. అవార్డు హోల్డ్ చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. దీంతో పోలీసులు ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
- Advertisement -