Wednesday, January 15, 2025

అరికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ గాంధీ ఇంటికి వస్తానని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. బిఆర్‌ఎస్‌ కార్యకర్తలందరూ తరలిరావాలంటూ కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని పిలుపునిచ్చిన విషయం విధితమే. మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నివాసం నుండి బిఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరి వెళ్లనుంది. దీంతో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  గురువారం కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ వెళ్లడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా శుక్రవారం ఉదయం నుంచే గాంధీ ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లిలో బిఆర్ఎస్ మీటింగ్ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సి శంబీపూర్ రాజు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ , కౌశిక్ రెడ్డిలు  సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News