- Advertisement -
బెంగళూరు : కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమారుకు వైద్యం అందించిన కుటుంబ డాక్టర్ రమణరావుకు బెంగళూరు పోలీసులు రక్షణ కల్పించారు. వైద్యంలో జరిగిన నిర్లక్ష్యమే పునీత్ మరణానికి కారణమని పలువురు అభిమానులు ఆరోపించడమే కాకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బెంగళూరు సిటీ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. సదాశివనగర్‌లోని ఆయన నివాసం, క్లినిక్ బయట కెఎస్‌ఆర్‌పి ప్లాటూన్‌ను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, గస్తీని ముమ్మరం చేశామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. పునీత్‌కు వైద్య చికిత్స అందించిన డాక్టర్ రమణరావు, ఇతర వైద్య నిపుణులకు రక్షణ కల్పించాలని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల అసోసియేషన్ కోరడంతో పోలీసులు ఈ భద్రత కల్పించారు.
- Advertisement -