Monday, December 23, 2024

కొడనాడు చోరీపై శశికళను ప్రశ్నించిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

Police question Shashikala in Kodanadu case

చెన్నై: తమిళనాడులోని నీలగిరులలో గల కొడనాడు ఎస్టేట్ బంగళాలో 2017లో జరిగిన భారీ చోరీ, హత్య కేసుకు సంబంధించి ఎఐఎడిఎంకె బహిష్కృత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి వికె శశికళను గురువారం పోలీసులు ప్రశ్నించారు. ఈ ఎస్టేట్ బంగళాను జయలలిత తన విడిదికి ఉపయోగించుకునేవారు. 2016లో జయలలిత మరణం తర్వాత ఈ బంగళాలో కొన్ని వస్తువులు మాయం కావడంతోపాటు వాచ్‌మెన్ హత్య జరిగింది. వెస్ట్‌జోన్ ఐజి ఆర్ సుధాకర్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం గురువారం శశికళను ఆమె నివాసంలో ప్రశ్నించారు. ఈ కేసు దర్యాప్తులో సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎస్టేట్ బంగళాకు చివరిసారి ఎప్పుడు వెళ్లారు..అక్కడ ఉంచిన డాక్యుమెంట్లు, నగదు ఎంత, ఏమిటి&జయలలితకు డ్రైవర్‌గా పనిచేసి ప్రమాదంలో మరణించిన కనగరాజ్‌ను ఎప్పుడైనా కలుసుకున్నారా..వంటి ప్రశ్నలను పోలీసులు శశికళను అడిగినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News