Monday, December 23, 2024

పబ్​పై పోలీసుల దాడులు.. అదుపులో ప్రముఖ సింగర్

- Advertisement -
- Advertisement -

Police raid Banjara Hills Radisson Blu Hotel

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని పబ్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. సమయానికి మించి పబ్ ను నడుపినందుకు కేసు నమోదు చేశారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ లో కొకైన్, గంజాయి, ఐఎస్ డి పోలీసులు డ్రగ్సను గుర్తించారు. పబ్ యజమాని సహా 130 మందిని అందుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 33 మంది యువతులు, 95 మంది యువకులు ఉన్నారు. తమను ఎందుకు తీసుకువచ్చారంటూ యువకులు ఆందోళన చేశారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల అదుపులోకి తీసుకున్న వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నట్టు సమాచారం. సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వారి వివరాలు నమోదు చేసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశామని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News