Wednesday, February 5, 2025

బిచ్చగత్తె ఇంటిపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ ముజఫర్‌పూర్ జిల్లాలో పలు ఇళ్లలో దొంగతనాల్లో ఒక బిచ్చగత్తె పాత్ర ఉందనే ఆరోపణలపై పోలీసులు జరిపిన దర్యాప్తులో దొరికినవి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. బిచ్చగత్తె ఇంటిపై దాడిలో లక్ష రూపాయలు విలువ చేసే ఒక కెటిఎం బైక్, 12 మొబైల్ ఫోన్లు, పలు దేశాలకు చెందిన వెండి నాణాలు దొరికాయి. ఆ నాణాల్లో ఒకటి బ్రిటిష్ రాజ్ నాటిది. ఆ మహిళ నీలమ్ దేవి అని, తమ నివాస ప్రాంతాల్లో ఇంటింటికి వెళుతుండేదని ఆ ప్రాంత వాసులు తమతో చెప్పినట్లు గ్రామీణ ఎస్‌పి విద్యా సాగర్ తెలియజేశారు. ఆమె ఇటీవల దోమ తెరలు కూడా విక్రయించసాగింది. ‘భిక్షాటన వెనుక అసలు ఉద్దేశం లక్షాల గుర్తింపు అని మేము కనుగొన్నాం. ఆమె రెక్కీ నిర్వహించేది, ఆమె అల్లుడు రాత్రి పూట లక్షిత ఇంటిలో చోరీ చేస్తుండేవాడు’ అని ఆయన తెలిపారు.

నీలమ్ దేవిని పోలీసులు అరెస్టు చేయగా, ఆమె అల్లుడు చుతుక్ లాల్ పరారీలో ఉన్నాడు, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న కెటిఎం బైక్ చోరీల్లో ఉపయోగించినదని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో వివిధ బ్రాండ్లకు చెందిన 12 మొబైల్ ఫోన్లు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, కువైట్‌లకు చెందిన నాణాలు, ఒక బంగారు గొలుసు, ఇతర స్వర్ణాభరణాలు, కెటిఎం బైక్ ఉన్నాయి. ‘ఆమె అల్లుడు పరారీలో ఉన్నాడు. అతనిని అరెస్టు చేస్తే తక్కిన ముఠా సభ్యుల వివరాలు మాకు తెలుస్తాయి. విదేశీ నాణాలు ఆమె ఇంటికి ఎలా చేరాయో మేము దర్యాప్తు చేస్తున్నాం. ఆమెను జైలుకు పంపాం’అని విద్యా సాగర్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News