ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్టు
హైదరాబాద్: పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.61,780 నగదు, 52 ప్లేకార్డులు, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. బోరబండకు చెందిన ఏడుకొండలు టైలర్‌గా పనిచేస్తున్నాడు గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడు, వెంకటగిరికి చెందిన ఎండి సలీం టైలర్, షేక్ సిరాజ్, ఉదయ్, సురేష్, వర్మ, చంద్రమౌలి కలిసి పేకాడుతున్నారు. ఏడుకొండలు కృష్ణానగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని మూడుముక్కలు, అండేర్ బహార్ గేమ్‌ను నిర్వహిస్తున్నాడు. పంటర్ల సాయంతో పేకాట ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిని పిలిచి నిర్వహిస్తున్నాడు. అందరూ కలిసి మూడు ముక్కలాట ఆడుతుండగా బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు దాడి చేసి పేకాడుతున్న వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఎస్సైలు శ్రీకాంత్ గౌడ్, శరత్ చంద్ర తదితరులు దాడి చేశారు.