Monday, December 23, 2024

‘చిల్ ఆన్’ పార్లర్‌పై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ఎర్రకుంటలోని హుక్కాపార్లర్‌పై రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ దాడులు నిర్వహించి ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకుంది. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, హుక్కా పాట్స్, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ హుక్కా పార్లర్‌లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.

సంస్థ యజమానులు మహ్మద్‌ అబ్దుల్‌ హసన్‌, హబీబ్‌ అహ్మద్‌ సాగర్‌ పరారీలో ఉన్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట రోడ్డులోని మదీనా బజార్‌లోని ఓ భవనంలో యజమానులు ‘చిల్ ఆన్’ అనే పార్లర్‌ను నిర్వహిస్తున్నారు. పార్లర్ యజమాన్యం నిర్దేశించబడిన నిబంధనలను ఉల్లంఘించిందని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News