Friday, November 22, 2024

వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జిపై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

Police raid lodge where prostitution takes place

 

నలుగురు నిందితుల అరెస్టు
నలుగురు నిందితులు, నలుగురు నిర్వాహకులు

మనతెలంగాణ, హైదరాబాద్ : వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జిపై రాచకొండ యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్, ఎల్‌బి నగర్ పోలీసులు దాడి చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం…. ఎపిలోని కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలం, చింతలపల్లి గ్రామానికి చెందిన దేసినేని వెంకటేశ్వర్ నగరంలోని హస్తినాపురంలో ఉంటున్నాడు.

పశ్చిమబెంగాల్, డార్జిలింగ్, పశ్చిమ బన్స్‌గాన్ ఫానిసిడేవా మండలం, కంటివిటా పోస్ట్, సుదాంగచ్ గ్రామానికి చెందిన సకిజాన్ ఖాటౌన్ అలియాస్ దీపిక అలియాస్ రేష్మా, మీర్‌పేటకు చెందిన రవి పరారీలో ఉన్నాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన మండ్ల అవినాష్ అలియాస్ నాని, ఖమ్మం జిల్లా, కొత్తగూడెం మండలం, టెక్కలపల్లి గ్రామానికి చెందిన గుగులోతు సుజాత అలియాస్ మాలోతు అనిత, అవినాష్ భార్య, రాజస్థాన్‌కు చెందిన ఖమ్మం పంచరామ్, నగరానికి చెందిన సిర్రా మనీష్ కస్టమర్, ఎపికి చెందిన అవల్‌దొడ్డి మధు కస్టమర్, ఎంపికి చెందిన వికాస్ కుమార్ సాకెట్‌ను అరెస్టు చేశారు.

దేశినేని వెంకటేశ్వర్ లాడ్జి సూపర్ వైజర్‌గా పనిచేయడంతో వ్యభిచారం నిర్వహిస్తే ఎన్ని డబ్బులు వస్తాయో మొత్తం తెలుసు. సులభంగా డబ్బులు సంపాధించాలని ప్లాన్ వేసి ఫిబ్రవరి, 2021లో లాడ్జిని అద్దెకు తీసుకున్నాడు. విటుల నుంచి రోజుకు రూ.5,000 తీసుకుని బాధితులకు రూ.2,000 ఇస్తున్నారు. అవసరం ఉన్న వారికి వాట్సాప్ ద్వారా వ్యభిచారం చేసే వారి ఫొటోలు పంపిస్తారు. వచ్చిన వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ చంద్రశేఖర్, వి. అశోక్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News