Wednesday, January 22, 2025

కల్తీ ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై దాడి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నకిలీ ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శుక్రవారం దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు తయారీ కేంద్రం నుంచి డూప్లికేట్ స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఎపి రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఐదేళ్ల నుంచి జవహర్‌నగర్ కాలనీలో ఐస్ క్రీం తయారు చేస్తున్నాడు.

బేగంబజార్ నుంచి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన ఐస్‌క్రీం స్టిక్కర్లను తీసుకుని వచ్చి కల్లీ ఐస్‌క్రింపై అతికించి విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీదేవి థియేటర్ సమీపంలోని ఐస్ క్రీం తయారీ కేంద్రంపై దాడి చేసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని చందానగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News