Monday, December 23, 2024

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు చేశారు. దాడుల్లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, ఇద్దరు యువతులకు విముక్తి కల్పించారు. వారి వద్ద నుంచి రూ.2,200 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…కుత్బుల్లాపూర్‌కు చెందిన సలాఉద్దిన్ ఖాన్ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు, ఇర్ఫాన్ ఖాన్ టైలర్‌గా పనిచేస్తున్నాడు. సలాఉద్దిన్ ఖాన్ విటులను anytimecallgirls.com వెబ్ సైట్ ద్వారా ఆహ్వానిస్తున్నాడు.

ఈ వెబ్‌సైట్ చూసి సంప్రదించిన వారికి లకిడికాపూల్‌లోని గంగాజమున హోటల్‌లో ఏర్పాట్లు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విటుల వద్ద నుంచి రూ.3,000 నుంచి రూ.4,000 వసూలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తనను సంప్రదించిన విటుడు ఇర్ఫాన్‌ఖాన్‌కు హోటల్‌లో యువతులతో కలిసి రూమ్ బూక్ చేశాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం నాంపల్లి పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News