Monday, December 23, 2024

గేమింగ్ హౌస్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

Police raid on gaming house

20మందిని అరెస్టు చేసిన ఎస్‌ఆర్ నగర్ పోలీసులు

హైదరాబాద్ : గేమింగ్ హౌస్‌పై దాడి చేసిన పోలీసులు పేకాడుతున్న ఇరవైమందిని ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,88,260 నగదు, 104 ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, నంది మండలం గ్రామానికి చెందిన రమాకాంత్ రెడ్డి నగరంలోని ఎర్రగడ్డ, మోతినగర్, శంకర్‌మట్‌లో ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు తన ఇంటిలో గేమింగ్ హౌస్‌ను నిర్వహిస్తున్నాడు. నగరానికి చెందిన మల్లారెడ్డి, వేమారెడ్డి, ఆంజనేయులు, ఎంకె కృష్ణ, శ్రీకాంత్, బాబు, నర్సింహ రావు, వెంకటేష్, హరినారాయణ, శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి. కడప జిల్లాకు చెందిన గురివి రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన హరికృష్ణ రెడ్డి, నగరానికి చెందిన అప్పారావు, మురళికృష్ణ రెడ్డి, రవి, శ్రీనివాస్‌ను ఎస్‌ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. గేమింగ్ హౌస్ నిర్వాహకుడు రమాకాంత్ రెడ్డి ప్రతి గేమ్‌కు ప్లేయర్ల నుంచి కమీషన్ తీసుకుంటున్నాడు. పేకాడేందుకు వస్తున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ రాజేష్, ఎస్సైలు రంజిత్, మల్లికార్జున్, ఎండి ముజఫర్‌అలీ, షేక్ కవియుద్దిన్ తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News