Monday, December 23, 2024

గేమింగ్ హౌస్‌పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

Police raid on gaming house

14మంది అరెస్టు
రూ.80,135 నగదు స్వాధీనం

మనతెలంగాణ, హైదరాబాద్ : గేమింగ్ హౌస్‌పై దాడి చేసిన పోలీసులు పేకాడుతున్న 14మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.80,135 నగదు, నాలుగు సెట్ల ప్లేకార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరానికి చెందిన చండీ శేఖర్, బాజా సాయిబాబా, ఉపాధ్యాయ రాజారాం, సుశీల్ యాదవ్, మల్లెపూల రాజు, కర్నాల మహేష్, గోవింద్ యాదవ్, మొగిలి గణేష్, కవులే విశాల్, సిల్వర్ రఘు, ఎండి హుస్సేన్, కీర్తి ప్రవీణ్, వినోద్ కుమార్, బుస్సా సంతోష్‌ను అరెస్టు చేశారు. చండీ శేఖర్ కోటిలోని పుత్లీబౌలిలో ఉన్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ రూమును అడ్డాగా చేసుకుని గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. ఆసక్తి ఉన్న వారిని పేకాడేందుకు ఆహ్వానిస్తున్నాడు. వచ్చిన వారు రూ.500 ఇచ్చి మూడు ముక్కలాట ఆడువారు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు నిందితుడు ప్లాన్ చేసి గేమింగ్ హౌస్ నిర్వహిస్తున్నాడు. తెలిసి తెలియని వ్యక్తులను పేకాడేందుకు ఆహ్వానించేవాడు, ఇలా వచ్చిన వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ విషయం తెలియడంతో అఫ్జల్‌గంజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News