Thursday, January 16, 2025

హుక్కా కేంద్రంపై పోలీసులు దాడి…18 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : హుక్కా కేంద్రంపై పోలీసులు దాడిచేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నా రు. వీరిలో ఒక మైనర్ కూడా ఉన్నాడు. ఆ కేంద్రం నుండి హుక్కా పరికరాలను, ఈసిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని రూబీ హోటల్ సమీపంలో కాఫీ లాంచ్ పే రిట ఖాలేద్ బహమద్ అనే వ్యక్తి రహస్యంగా హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు.

దీనిలో ఉమర్ సయ్యద్ మే నేజర్‌గా పనిచేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మే రకు దక్షిణ తూర్పు మండల టాస్క్‌ఫోర్స్, చాంద్రాయణగుట్ట పోలీసులు కాఫీ లాంచ్‌పై మెరుపు దాడి చేశారు. ఆ సమయంలో 18 మంది హుక్కా, నిషేధిత ఈ సిగరెట్లను సేవిస్తున్నారు. వీరిలో ఒకమైనర్ బాలుడున్నాడు. అందరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News