Monday, December 23, 2024

హుక్కా పార్లర్‌పై పోలీసులు దాడి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్: ఎలాంటి అనుమతి తీసుకోకుండా నిర్వహిస్తున్న హుక్కా పార్లర్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఇద్దరు యువకులను అరెస్టు చేయగా మరో యువకుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి హుక్కాకు సంబంధించిన ఫ్లేవర్లు, పైపులు, పాట్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం……హైదరాబాద్, గోల్కొండకు చెందిన మీర్జా ఇబ్రహిం అహ్మద్, ఎండి వాజీద్, మీర్జా ఫుర్కాన్‌బైగ్ కలిసి ‘ది పాన్ హౌస్ ఎన్ మోర్’ హుక్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ముగ్గురుస్నేహితులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు.

దీనికి హుక్కా సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చి సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మీర్జా గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో హుక్కా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఏర్పాటు చేసి నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఆరోగ్యంపై ప్రభావం చూపే ఫ్లేవర్లు వాడుతున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కోసం గోల్కొండ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News