హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా పార్లర్‌ఫై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు చేశారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి రూ.40వేల విలువైన హుక్కా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని కాలాపత్తర్‌కు చెందిన సయిద్ అర్షద్ హుస్సేనీ, సయిద్ ఓబైద్ హుస్సేనీ సొంత అన్నదముళ్లు. ఇద్దరు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు.
దీంతో ‘దీ శీషా ఫ్యాక్టరీ కేఫ్’ పేరుతో హుక్కా సెంటర్‌ను టోలీచౌకి, కాకతీయ నగర్‌లో ప్రారంభించారు. నిందితులు పార్లర్ ప్రారంభించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పెద్ద ఎత్తున కోల్, హుక్కాకు సంబంధించిన సామద్రిని డంప్ చేశారు. కోల్ వల్ల వేసవి కావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకుని దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఇన్స్‌స్పెక్టర్ ఖలీల్‌పాషా తెలిపారు. కేసు దర్యాప్తు కోసం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించామని తెలిపారు.