Sunday, December 22, 2024

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..బిల్డింగ్‌పై నుంచి దూకిన వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

పేకాట స్థావరంపై దాడి చేయడంతో ఓ వ్యక్తి బిల్డింగ్‌పై నుంచి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సికింద్రాబాద్ లాలాపేట్‌లోని ఓ బిల్డింగ్‌లో కొందరు పేకాడుతున్నారనే సమాచారం పోలీసులకు వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పోలీసులను చూసి భయాందోళనకు గురైన పేకాటరాయుళ్లు తప్పించుకునే క్రమంలో మూడంతస్తుల భవనంపై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించాడు. బిల్డింగ్‌పై నుంచి దూకడంతో వినయ్(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News