Sunday, December 22, 2024

స్పా సెంటర్‌పై పోలీసుల దాడి..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః క్రాస్ మసాజ్ చేస్తున్న స్పా సెంటర్‌పై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడి చేశారు. దాడిలో ముగ్గురు నిర్వాహకులు, ఐదుగురు కస్టమర్లు, నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ..నగరానికి చెందిన బండి అనిల్‌కుమార్, కిషన్ సింగ్ హజారీ, దుర్గా ప్రసాద్ కలిసి యంత్ర స్పా, నగరంలోని హిమాయత్‌నగర్‌లో నిర్వహిస్తున్నారు. కస్టమర్లు అజ్మత్ అలీ అన్సారీ, కృష్ణ కుమార్ బహేటి, అజయ్ సింగ్ రామనాథన్, ప్రియేష్ చందును అదుపులోకి తీసుకున్నారు.

నిర్వాహకులు సులభంగా డబ్బులు సంపాదించాలని యువతులను తీసుకుని వచ్చి క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. యువతులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపి మసాజ్ చేయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు దాడి చేశారు. స్పాలో రికార్డులు లేవు, సిసిటివిలు లేవు, వారి వద్ద ఎలాంటి థెరపిస్టు సర్టిఫికేట్లు లేనట్లు తనిఖీల్లో బయటపడింది. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సై నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం దోమలగూడ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News