Thursday, January 23, 2025

స్పా, మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న స్పాలు, మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న స్పాలు, మసాజ్ సెంటర్ల నిర్వాహకులను అరెస్టు చేసి పలువురు యువతులకు విముక్తి కల్పించారు. బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లోని మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పాలపై దాడులు చేశారు. వీటి నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకుని వచ్చి వారితో క్రాస్ మసాజ్, వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ సెంటర్లలో సిసి కెమెరాలు లేకపోవడం, రిజిస్టర్‌లో ఆయా సెంటర్లకు వస్తున్న వారి వివరాలు రాయడంలేదు, ఇది నిబంధనలు ఉల్లంఘించడమే నని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News