Wednesday, January 22, 2025

స్పా ముసుగులో వ్యభిచారం..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్లపై బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఐదుగురు విటులను అరెస్టు చేసిన పోలీసులు, 14మంది యువతులను రెస్కూ హోమ్‌కు తరలించారు. ఎస్సై కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం.. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకుని వచ్చి వ్యభిచారం స్పా సెంటర్లలో వ్యభిచారం చేయిస్తోంది. దీనికి గాను ఒక్కో యువతికి రూ.15,000 ఇస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న హెవెన్ ఫ్యామిలీ స్పా, వెల్వెట్ స్పా సెంటర్లపై పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News