Sunday, December 22, 2024

అసలేం జరిగిందంటే…?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా సిఎం కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని మాదాపూర్‌లోని కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం కార్యాలయం కేంద్రంగా ఇదంతా జరుగుతోందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని సోనాలి స్పాజియో టవర్స్‌లో ఉన్న తెంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు పోలీసులు మఫ్టీలో వెళ్లారు. అక్కడి సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకునేందుకు యత్నించారు. సమాచారం అందడంతో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, షబ్బీర్ అలీ తదితరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

తమ పార్టీ కార్యాలయానికి ఎందుకొచ్చారని, నోటీసులు చూపించాలని నిలదీశారు. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో షబ్బీర్ అలీ, మల్లురవి, మహేష్‌గౌడ్‌లతో పాటు మరికొందరు నేతల్ని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా స్వల్పంగా తోపులాట జరిగింది. కార్యాలయం దగ్గర కార్యకర్తలు బైఠాయించారు. అయినా పోలీసులు సోదాలను కొనసాగించారు. కంప్యూటర్ సిపియూలను, పత్రాలను తమ వెంట తీసుకెళ్లారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని హైదరాబాద్ సైబర్ క్రైం ఎసిపి కెవిఎం ప్రసాద్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News