ఇద్దరి అరెస్టు, రూ.10లక్షల విలువైన మిషన్లు, టొబాకో వస్తువులు స్వాధీనం
హైదరాబాద్ : నిషేధీత జర్ధా తయారీ యూనిట్‌పై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువైన మిషన్లు, టొబాకో వస్తువలు స్వాధీనం. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖైరతాబాద్‌కు చెందిన శైలేంద్రప్రసాద్, సుదేష్‌కుమార్ నిషేధిత జార్ధా తయారు చేస్తున్నారు. పతేర్‌గటి ఏరియాలో జర్ధా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ జర్ధా, పొగాకుకు సంబంధించిన వస్తువులు తయారు చేసి నగరంలోని పలు పాన్ షాపులకు తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కేసు దర్యాప్తు కోసం మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, తదితరులు పట్టుకున్నారు.