Wednesday, January 22, 2025

ఐస్ క్రీమ్స్ బాగా ఇష్టమా?.. నకిలీ వస్తున్నాయ్ జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

దూలపల్లి: మేడ్చల్ జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని దూలపల్లిలో నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. నకిలీ ఐస్ క్రీమ్స్ తయారీ కేంద్రంపై పోలీసులు శనివారం దాడి చేశారు. నాసిరకం ముడి సరుకులతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. గోదాములోంచి రూ. 8.20 లక్షల విలువైన ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పక్క సమాచారంతో గోదాంలో తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News